కోరికలను నెరవేర్చు వేంకటేశ్వరుడు

వేంకటేశ్వరస్వామి కొలువైన క్షేత్రాలలో 'తిరువూరు'ఒకటి. కృష్ణాజిల్లా పరిధిలోని ఈ క్షేత్రంలో శ్రీదేవి - భూదేవి సమేత వేంకటేశ్వరుడు వెలుగొందుతున్నాడు. సువిశాలమైన ప్రదేశంలో నిర్మితమైన ఈ ఆలయం, ప్రశాంతతకు ప్రతీకగా కనిపిస్తూ ఉంటుంది. విశాలమైన ముఖమంటపం .. అంతరాళం .. గర్భాలయంతో ఈ ఆలయం అందంగా తీర్చిదిద్దబడి ఉంటుంది. ఇక్కడి స్వామివారు మహిమాన్వితుడని భక్తులు చెబుతుంటారు.

మనసులోని ధర్మబద్ధమైన కోరికలను చెప్పుకుంటే స్వామివారు నెరవేర్చుతాడని అంటారు. స్వామివారి దర్శనం చేసుకోవడం వలన సకల శుభాలు చేకూరతాయని చెబుతారు. 'ధనుర్మాసం'లో ఇక్కడ ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. ప్రతియేటా 'మాఘ పౌర్ణమి' రోజున స్వామివారికి వైభవంగా కల్యాణాన్ని జరుపుతారు. ప్రత్యేక మంటపంలో జరిగే ఈ కల్యాణోత్సవాన్ని తిలకించడానికి చుట్టుపక్కల గ్రామాల నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు తరలి వస్తుంటారు. స్వామివారికి కట్నకానుకలు సమర్పించుకుని, ఆశీస్సులు అందుకుని వెళుతుంటారు.    


More Bhakti News