పెరుగుతున్న శంభులింగేశ్వరుడు

పరమశివుడు ఆవిర్భవించిన ప్రాచీన క్షేత్రాలలో 'మేళ్లచెరువు' ఒకటి. సూర్యాపేట జిల్లా పరిధిలోని ఈ క్షేత్రం అనేక మహిమలకు నిలయంగా వెలుగొందుతూ ఉంటుంది.  ఇక్కడి స్వామి శంభులింగేశ్వరుడిగా పూజాభిషేకాలు అందుకుంటూ ఉంటాడు. గర్భాలయంలోని శివలింగం పెరుగుతూ ఉండటం ఇక్కడి విశేషం. శివలింగం పెరుగుతూ ఉందనడానికి నిదర్శనాన్ని ఇక్కడి అర్చక స్వాములు చూపిస్తారు.

ఇక శివలింగం వెనుక భాగంలో పైన ఒక రంధ్రం ఉంటుంది. ఇది సహజ సిద్ధంగా ఏర్పడినదే. ఈ రంధ్రంలో నుంచి నిరంతరం నీరు ఉబికి వస్తుంటుంది. ఈ రంధ్రం నిండిపోయి నీరు పొర్లిపోవడం జరగదు. అలాగే రంధ్రంలోని నీరు తగ్గిపోవడం జరగదు. ఇది మరో విశేషంగా .. మహిమాన్వితంగా అనిపిస్తుంది. శివరాత్రి పర్వదినం సందర్భంగా ఇక్కడ జరిగే జాతరకు వేల సంఖ్యలో భక్తులు తరలి వస్తారు .. స్వామి దర్శనం చేసుకుని పునీతులవుతారు.


More Bhakti News