మాల్యాద్రి
సమస్త ప్రాణికోటి అవసరాలు ... ఆపదలు తీర్చడం వలన అలసిపోయిన దేవుడు కూడా, భూలోకంలోని ప్రకృతి ఒడిలో సేదతీరడానికే ఇష్టపడతాడు. అమ్మవారితో కలిసి అలా అలా విహరించడమే కాకుండా, తనకి బాగా నచ్చిన ప్రదేశాల్లో కొలువుండి పోతుంటాడు ... కొంగు బంగారమైపోతుంటాడు. అలా ప్రకాశం జిల్లా వలేటివారిపాలెం మండలంలోని 'మాలకొండ'లో శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వెలిశాడు. ఇక ఈ క్షేత్రంలో స్వామివారు కొలువుదీరడానికీ ... ఈ క్షేత్రానికి మాలకొండ అనే పేరు రావడానికిగల కారణాన్ని మనకి స్థలపురాణం తెలియజేస్తుంది.
స్థితి కారకుడైన విష్ణుమూర్తి భూలోకంలోని పవిత్రమైన ... ప్రశాంతమైన ప్రదేశంలో విశ్రాంతి తీసుకోవాలని నిర్ణయించుకున్నాడు. అలాంటి ప్రదేశాన్ని అన్వేషించి రమ్మని గరుత్మంతుడిని ఆదేశించాడు. ఆ పనిపై బయలుదేరిన గరుత్మంతుడుకి ఈ కొండ ప్రదేశం ఎంతగానో నచ్చింది. దాంతో తనతో తెచ్చిన పూలమాలను గుర్తుగా ఆ కొండపై వుంచి వెళ్లి శ్రీ మహావిష్ణువును తీసుకువచ్చాడు. గరుత్మంతుడు మాలను కొండపై ఉంచిన కారణంగా ఈ ప్రదేశానికి 'మాలకొండ' అనే పేరు స్థిరపడిపోయింది ... కాలక్రమంలో 'మాల్యాద్రి'గా మారింది.
ఆ తరువాత అగస్త్య మహర్షి ఈ కొండపై తపస్సుచేసి స్వామివారిని ప్రత్యక్షం చేసుకున్నాడు. ఆయన కోరికపై స్వామివారు ఇక్కడ లక్ష్మీ నృసింహస్వామిగా వెలిశాడు. వారంలో ఆరు రోజులపాటు దేవతల పూజలు అందుకోవలసిందిగా ... ఒక రోజు మాత్రం మానవుల పూజలు అందుకోవలసిందిగా స్వామివారిని అగస్త్యుడు కోరాడట. ఆ విధంగానే ఇప్పుడు ఈ క్షేత్రంలో ఆరు రోజులపాటు స్వామివారిని దేవతలు పూజిస్తూ ఉంటారని భావిస్తారు. శుక్రవారం రాత్రికి పూజారులు కొండపైకి చేరుకాగా, ఏడవ రోజైన శనివారం మాత్రం వేలసంఖ్యలో భక్తులు ఈ క్షేత్రానికి తరలివస్తారు.
ఈ విషయాన్ని కొట్టిపారేస్తూ కొందరు ఏడు రోజులపాటు గుడిని తెరిపించి ఉంచడానికి ప్రయత్నించి చిక్కుల్లో పడ్డారట. అప్పటి నుంచి ఈ నిబంధనను ఉల్లంఘించడానికి ఎవరూ సాహసించలేదని అంటారు. ఈ క్షేత్రంలో చైత్ర ... వైశాఖ ... జ్యేష్ట మాసాలలో ఆవునెయ్యితో పిండి ప్రమిదలో దీపారాధన చేస్తే కోరిన కోరికలు నెరవేరతాయని భక్తులు విశ్వసిస్తుంటారు.