ధన్యులను చేసే రామేశ్వర దర్శనం

పరమపవిత్రమైన క్షేత్రాలలో 'రామేశ్వరం' ఒకటిగా కనిపిస్తుంది. ద్వాదశ జ్యోతిర్లింగ క్షేత్రాలలో ఒకటిగా ఈ క్షేత్రం వెలుగొందుతోంది. ప్రపంచంలోనే అతిపెద్ద ఆలయ ప్రాంగణం కలిగిన క్షేత్రంగా 'రామేశ్వరం' ప్రసిద్ధి చెందింది. అలాంటి ఈ క్షేత్రంలో 22 పుణ్య తీర్థాలు వున్నాయి. ఈ తీర్థాలలో స్నానమాచరించి భక్తులు దైవదర్శనానికి వెళుతుంటారు. ఒక్కో పుణ్యతీర్థం ఒక్కో విశేషాన్ని కలిగి ఆధ్యాత్మిక భావాలను మరింతగా పెంపొందింపజేస్తుంటాయి.

వాల్మీకీ రామాయణం .. ఆధ్యాత్మిక రామాయణం .. తులసీ రామాయణం .. మొల్ల రామాయణం .. కంబ రామాయణం .. ఆనంద రామాయణాలలో రామేశ్వర క్షేత్రం ప్రస్తావన కనిపిస్తుంది. మత్స్య పురాణం .. కూర్మ పురాణం .. బ్రహ్మ పురాణం .. శివపురాణం .. మార్కండేయ పురాణాలు కూడా రామేశ్వర క్షేత్రాన్ని గురించి ప్రస్తావించాయి. అలాగే ప్రాచీన తమిళ గ్రంధాలలో రామేశ్వర క్షేత్ర మహిమలను గురించిన విశేషాలు ప్రస్తావించబడ్డాయి. అలాంటి రామేశ్వర క్షేత్రాన్ని జీవితంలో ఒక్కసారైనా దర్శిస్తే ధన్యత పొందినట్టే.    


More Bhakti News