ఈ రోజున గౌరీదేవిని పూజించాలి

జగన్మాత అయిన పార్వతీదేవినే భక్తులు గౌరీదేవిగా పూజిస్తుంటారు. తమ సౌభాగ్యం నిలిచి వుంచేలా చూసేది ఆ గౌరీదేవియేనని భావించి ఆరాధిస్తూ వుంటారు. అలాంటి గౌరీదేవిని పూజించే విశేషమైన రోజుగా 'అట్లతద్ది' కనిపిస్తుంది. అట్లతద్దినే 'చంద్రోదయ గౌరీ వ్రతం' అని పిలుస్తుంటారు. ఈ రోజున స్త్రీలు ఉదయాన్నే నిద్రలేచి తల స్నానం చేసి, పూజా మందిరంలో గౌరీదేవిని ప్రతిష్ఠించుకుని పూజించవలసి ఉంటుంది.

ఈ రోజున ఉదయం నుంచి సాయంత్రం చంద్రోదయమయ్యే వరకూ ఉపవాస దీక్షను చేపట్టి ఉండాలి. చంద్రోదయం అయ్యాక అట్లుపోసి అమ్మవారికి నైవేద్యంగా సమర్పించి, తాము ఉపవాస దీక్షను విరమించవలసి వుంటుంది. ఆ తరువాత పది మంది ముత్తయిదువులను పేరంటానికి పిలిచి, దక్షిణ తాంబూలాలతో పాటు .. పదేసి అట్ల చొప్పున వాయనంగా ఇవ్వవలసి వుంటుంది. ఈ విధంగా ఈ వ్రతాన్ని పది సంవత్సరాల పాటు చేసి .. ఆ తరువాత ఉద్యాపన చెప్పవలసి ఉంటుంది. ఈ వ్రతాన్ని భక్తి శ్రద్ధలతో ఆచరించడం వలన, గౌరీదేవి అనుగ్రహం కలుగుతుందనేది ఆధ్యాత్మిక గ్రంధాలు చెబుతున్నాయి.     


More Bhakti News