లక్ష్మీదేవి అనుగ్రహం ఇలా కూడా లభిస్తుందట

అన్ని సమస్యల్లోకి ఆర్థికపరమైన సమస్య పెద్దదిగా కనిపిస్తుంది. మానసికంగాను .. శారీరకంగాను కుంగదీస్తుంది. అత్యవసర పరిస్థితులు ఎదురైనప్పుడు నిస్సహాయుడిని చేసి వేదనకి గురిచేస్తుంది. అందువలన ప్రతి ఒక్కరూ కూడా ఆర్థికపరమైన ఇబ్బందులు ఎదురుకాకుండా చూడమనే దైవాన్ని వేడుకుంటారు. ఆర్థికపరమైన ఇబ్బందులు దరిచేరకుండా ఉండాలంటే లక్ష్మీదేవి అనుగ్రహం వుండాలని ఆధ్యాత్మిక గ్రంధాలు చెబుతున్నాయి.

లక్ష్మీదేవి ప్రీతి చెందితే ఆ తల్లి అనుగ్రహం లభిస్తుంది. అలా లక్ష్మీదేవి అనుగ్రహం లభించేలా చేసేదిగా 'ఆశ్వయుజ పౌర్ణమి' కనిపిస్తుంది. ఈ రోజున లక్ష్మీదేవికి ఎంతో ప్రీతికరమైన 'కోజాగరీ వ్రతం' ఆచరించాలనేది మహర్షుల మాట. ఈ రోజున ఈ వ్రతాన్ని ఆచరించి .. మిగిలిన సమయమంతా కూడా భక్తి శ్రద్ధలతో అమ్మవారిని స్మరిస్తూ .. సేవిస్తూ ఉండాలి. ఆ తల్లిని కీర్తిస్తూనే జాగరణ చేయాలి. ఈ రోజున రాత్రివేళలో ఆకాశ మార్గాన ప్రయాణించే అమ్మవారు, జాగరణ చేసేవారిని అనుగ్రహిస్తుందని చెబుతారు. అందువలన లక్ష్మీదేవి అనుగ్రహాన్ని పొందాలనుకునేవారు ఈ వ్రతాన్ని ఆచరించడం మరిచిపోవద్దు.

More Bhakti Articles