పంచాక్షరి

పంచాక్షరి
'ఓం నమఃశివాయ' అంటూ ఆదిదేవుడిని ప్రార్ధిస్తూ వుంటాం. ఇందులో ఓం అనేది ప్రణవం కాగా 'నమఃశివాయ' అనేది పంచాక్షరి అంటారు. పంచాక్షరి అనేది పంచభూతముల కారణంగా ఏర్పడిన ఈ సకల చరాచర సృష్టిని సూచిస్తుంది. అంతే కాకుండా 'సృష్టి' ... 'స్థితి' ... 'లయము' ... 'తిరోధానం' ... 'అనుగ్రహం'అనే పంచకృత్యములను ఇది తెలియజేస్తుంది.

ఇక 'నమఃశివాయ'అనేది స్థూల పంచాక్షరి అనీ ... 'శివాయ నమః' అనేది సూక్ష్మ పంచాక్షరిగా శాస్త్రం పేర్కొంటోంది. 'ఓం నమఃశివాయ' అనే ఈ పంచాక్షరి మంత్రం మహా శక్తిమంతమైనది. ఇది ఆపదలో అభయాన్నిస్తుంది ... కష్టాల్లో కరుణిస్తుంది ... మనస్పూర్తిగా స్మరించిన వారి కోసం కాలాన్ని సైతం ఎదిరిస్తుంది.

More Bhakti Articles