ఇక్కడి కృష్ణుడికి వంద లీటర్ల పాలతో అభిషేకం

'బృందావనం'లో అడుగడుగునా శ్రీకృష్ణుడి లీలా విశేషాలు కనిపిస్తాయి. కృష్ణుడి కాలానికి తీసుకెళ్లి అనిర్వచనీయమైన అనుభూతిని కలిగిస్తాయి. కృష్ణుడి పాద స్పర్శ చేత పవిత్రమైన 'బృందావనం'లో అలా తిరుగుతూనే వుండాలనిపిస్తుంది. ఇక్కడ గోపాలభట్టు గోస్వామి నిర్మించిన కృష్ణుడి ఆలయం చూసి తీరవలసిందే. సాక్షాత్తు శ్రీకృష్ణుడే గోపాలభట్టు గోస్వామికి ఇచ్చిన సాలగ్రామం ఈ ఆలయంలో నేటికీ కనిపిస్తుంది.

కృష్ణుడు ఇచ్చిన ఆ సాలగ్రామాన్ని ఆయన అత్యంత భక్తి శ్రద్ధలతో పూజిస్తూ ఉండేవారట. ఒకసారి ఆయన ఆ సాల గ్రామానికి పూజ చేస్తూ .. అది కృష్ణుడి రూపంలో వుంటే ఎంత బాగుండునో కదా అనుకున్నారట. అంతే .. ఆ సాలగ్రామానికి కళ్లు .. ముక్కు .. చెవులు వచ్చేశాయట. ఆ సంఘటన జరిగింది 'వైశాఖ పౌర్ణమి' రోజున కావడంతో, ప్రతి ఏడాది ఆ రోజున స్వామివారికి 'వంద' లీటర్ల పాలతో అభిషేకం చేస్తారట. స్వామివారు ఇక్కడ ప్రత్యక్షంగా ఉండటంతో, గోపాలభట్టు గోస్వామియే ఆలయాన్ని నిర్మించాడని స్థలపురాణం చెబుతోంది. ఇక్కడి స్వామివారిని పూజించడం వలన కష్టాలు తొలగిపోయి, సుఖ సంతోషాలు కలుగుతాయని భక్తులు విశ్వసిస్తుంటారు.   


More Bhakti News