అనుగ్రహించే అయినవిల్లి వినాయకుడు

ఏ శుభకార్యాన్ని తలపెట్టినా ప్రతి ఒక్కరూ వినాయకుడిని పూజించి .. ఆయన ఆశీస్సులను కోరుకుంటూ ఆరంభిస్తారు. విఘ్నాలను తొలగించి విజయాలను కలిగించే వినాయకుడు, అనేక ప్రాంతాల్లో స్వయంభువు మూర్తిగా ఆవిర్భవించాడు. అలా వినాయకుడు స్వయంభువుగా ఆవిర్భవించిన ప్రాచీన క్షేత్రాల్లో 'అయినవిల్లి' ఒకటి. తూర్పుగోదావరి జిల్లాలోని ఈ క్షేత్రంలో స్వామివారు సిద్ధి వినాయకుడిగా పూజాభిషేకాలు అందుకుంటూ ఉంటాడు.

స్వామివారు ఇక్కడ ఆవిర్భవించడం వెనుక ఒక ఆసక్తికరమైన కథనం వినిపిస్తూ ఉంటుంది. ఇది ఎంతో మహిమాన్వితమైన క్షేత్రంగా చెబుతారు. దక్ష యజ్ఞాన్ని ప్రారంభించడానికి ముందు దక్షప్రజాపతి ఇక్కడి స్వామిని పూజించాడని అంటారు. ఇక్కడి స్వామివారిని దర్శించుకుంటే, కొండంత కష్టమైనా కొవ్వొత్తిలా కరిగిపోతుందని అంటారు. ఆపదలు .. అనారోగ్యాలు తొలగిపోతాయని చెబుతారు. ధర్మబద్ధమైన కార్యం ఏది తలపెట్టినా స్వామి వెన్నంటి ఉంటాడని భక్తులు విశ్వసిస్తుంటారు. స్వామివారి ఆలయ ప్రాంగణంలోనే విశ్వేశ్వరుడు .. అన్నపూర్ణమ్మ తల్లి .. కాలభైరవుడు .. కేశవస్వామి కొలువై భక్తులకు దర్శనమిస్తుంటారు.    


More Bhakti News