పరమశివుడి మెడలోని కపాలాల వెనుక కథ

పరమశివుడు కపాల మాలను ధరించి సంచరిస్తూ ఉంటాడనే విషయం తెలిసిందే. ఆయన మెడలోని కపాల మాల వెనుక కథ ఏమిటో తెలుసుకోమని ఒకసారి సతీదేవితో నారద మహర్షి అంటాడు. దాంతో ఓ రోజున సదాశివుడితో సతీదేవి మాట్లాడుతూ .. కపాల మాల ధరించడానికి కారణమేమిటని అందుగుతుంది. ఆ మాటను దాట వేయడానికి శివుడు ఎంతగా ప్రయత్నించినా ప్రయోజనం లేకుండా పోతుంది. తనకి ఈ విషయం చెప్పితీరవలసిందేనని సతీదేవి పట్టుపడుతుంది.

దాంతో తన మెడలోని కాపాలాలు అన్నీ కూడా ఆమెవేనని చెబుతాడు శంకరుడు. ఆ మాట వినగానే సతీదేవి ఒక్కసారిగా ఆశ్చర్యపోతుంది. 'అవును ఇంతకుముందు నువ్వు 107 జన్మలెత్తావు .. వాటికి గుర్తుగా ధరించినదే ఈ కపాల మాల .. ఇవన్నీ నీ ముందు జన్మలకి సంబంధించినవి .. ఇంకొక కపాలం వచ్చి చేరనుంది .. అప్పుడు మాల పూర్తవుతుంది అని అంటాడు. సదాశివుడు అన్నట్టుగానే ఆ తరువాత సతీదేవి 'యజ్ఞకుండం'లోకి దూకి శరీరత్యాగం చేస్తుంది. అలా 108వ కపాలం వచ్చి చేరడంతో పరమశివుడి మెడలోని కపాల మాల పూర్తవుతుంది. ఆ తరువాత జన్మలో సతీదేవి .. పార్వతీదేవిగా జన్మించడం .. అమరత్వం పొందడం తెలిసిందే.    


More Bhakti News