ఇలాంటి పూలు పూజకు వాడకూడదు

భగవంతుడి పూజలో పూలు ప్రధానమైన పాత్రను పోషిస్తుంటాయి. భక్తులు వివిధ రకాల పూలను సేకరించి పూజలో సమర్పిస్తూ వుంటారు. కొంతమంది భక్తులు భగవంతుడికి సమర్పించడం కోసమే ఇంట్లో వివిధ రకాల పూల మొక్కలను పెంచుతుంటారు. అందుకు అవకాశం లేని వాళ్లు పూలను కొనేసి వాటితో దేవతార్చన చేస్తుంటారు. అయితే భగవంతుడికి సమర్పించే పూల విషయంలో తప్పకుండా కొన్ని నియమాలను పాటించాలని ఆధ్యాత్మిక గ్రంధాలు చెబుతున్నాయి.

 వాసన లేని పూలు .. ఘాటైన వాసన కలిగిన పూలు ..  ముళ్లు కలిగిన పూలు .. వాడిపోయిన పూలు .. రెక్కలు తెగిన పూలు .. పూజకు వాడకూడదు. అలాగే పరిశుభ్రమైన .. పవిత్రమైన ప్రదేశాల్లో లేని పూల మొక్కల నుంచి కోసిన పూలను కూడా పూజలో ఉపయోగించకూడదు. నేలపై పడిన పూలు .. పురుగు పట్టిన పూలు .. పూర్తిగా వికసించని పూలు .. ఎడమ చేత కోసిన పూలు భగవంతుడి పూజకు పనికి రావని ఆధ్యాత్మిక గ్రంధాలు స్పష్టం చేస్తున్నాయి. పరిశుభ్రమైన .. పవిత్రమైన ప్రదేశంలోని చెట్టుకు పూసిన సువాసన కలిగిన తాజా పూలను మాత్రమే భగవంతుడికి భక్తి శ్రద్ధలతో సమర్పించాలి. ఈ విధంగా చేయడం వలన భగవంతుడి అనుగ్రహం లభిస్తుందనేది మహర్షుల మాట.     


More Bhakti News