తల్పగిరి రంగనాథుడు
శ్రీ మహావిష్ణువు శయనించడానికి తల్పంగా మారిన కొండప్రదేశం కనుక ఈ క్షేత్రానికి 'తల్పగిరి' అనే పేరు వచ్చింది. నెల్లూరు జిల్లాలోని పెన్నానదీ తీరంలో ఈ క్షేత్రం అలరారుతోంది. స్థితి కారకుడైన శ్రీ మన్నారాయణుడు అలసిపోయినవాడిలా ఇక్కడ శయనిస్తూ, శ్రీరంగనాథస్వామిగా పూజలు అందుకుంటున్నాడు. ఇక్కడ ప్రశాంతంగా శయనిస్తున్న రంగనాథుడు సమ్మోహనకరంగా దర్శనమిస్తుంటాడు. ఒక్కసారి చూసినంతనే మనసును కట్టిపడేసి మళ్లీ ... మళ్లీ తన చెంతకు రప్పించుకుంటాడు.
తమిళనాడుకి చెందిన శ్రీ రంగమును ఆది రంగమనీ ... కన్నడ ప్రాంతంలోని శ్రీరంగపట్నం మధ్య రంగమనీ ... తల్పగిరిలో రంగనాథస్వామిది ఉత్తర రంగమని పండితులు భావిస్తుంటారు. 7 వ శతాబ్దంలో నెల్లూరు సీమను ఏలిన పల్లవులు ఇక్కడ స్వామివారి విగ్రహాన్ని ప్రతిష్టించారు. గర్భాలయంలో స్వామివారు దక్షిణం దిశగా తలను ఉంచి పశ్చిమాభి ముఖంగా శేషతల్పంపై విశ్రమిస్తుంటాడు. పల్లవుల తరువాత కాలంలో రెండవ రాజరాజ నరేంద్రుడు ఆలయాన్ని అన్ని విధాలా అభివృద్ధి పరిచాడు.
ఇక్కడ సీతాలక్ష్మణ హనుమ సమేత కోదండరామస్వామి దేవాలయం నయనానందకరంగా దర్శనమిస్తుంటుంది. ప్రతి ఏడాది జరిగే బ్రహ్మోత్సవాలతో పాటు, భక్తులు చేయించే నిత్య కల్యాణోత్సవాలతో స్వామివారు ఎప్పుడు చూసినా కళకళలాడుతూ కనిపిస్తుంటాడు. ఇక ఈ స్వామివారి రథోత్సవం అత్యంత వైభవంగా జరుగుతుంటుంది. ఈ ఉత్సవంలో భక్తులు వేలసంఖ్యలో పాల్గొని పరవశిస్తుంటారు.