ఆరోగ్యంగా వున్నప్పుడే తీర్థయాత్రలు చేయాలి

సాధారణంగా ఆధ్యాత్మిక భావాలు వృద్ధాప్యంలో ఉండాల్సినవనీ .. తీర్థయాత్రలు అప్పుడు చేయవలసినవేనని కొంతమంది అనుకుంటూ వుంటారు. వయసులో వున్నప్పుడు ఆరోగ్యంగా ఉండటం సహజం. ఆ వయసులో పిల్లలు .. ఉద్యోగం .. బాధ్యతల కారణంగా తీరిక ఉండకపోవడం జరుగుతూ ఉంటుంది. అందువలన ఆ బాధ్యతలు తీరిన తరువాత తీర్థయాత్రలు చేయాలని భావిస్తూ వుంటారు.

అయితే వయసుమళ్లిన తరువాత తీర్థయాత్రలకు బయలుదేరే భార్యాభర్తలకి ఎవరో ఒకరు సహాయంగా తోడుగా వెళ్లవలసి ఉంటుంది. వాళ్ల కోసం అంత సమయాన్ని కేటాయించే పరిస్థితులు అవతలివారికి ఉండొచ్చు .. ఉండకపోవచ్చు. బాధ్యతలు తీరేలోగా భార్యా భర్తలలో ఎవరో ఒకరు అనారోగ్యానికి లోనుకావొచ్చు. ఆర్ధిక పరిస్థితులు కూడా ఆటంకాన్ని కల్పించవచ్చు. అందువలన ఆరోగ్యంగా వున్నప్పుడే .. ఆర్ధిక పరమైన స్వేచ్ఛ వున్నప్పుడే వెళ్లాలనుకున్న తీర్థయాత్రలకు వెళ్లిరావాలి. ఆ తరువాత శరీరం సహకరించనప్పుడు ఆ పుణ్య క్షేత్రాలను మానసికంగా దర్శించుకుని సంతృప్తిని చెందవచ్చు.     


More Bhakti News