సంతృప్తి సంతోషాన్ని .. ప్రశాంతతను ఇస్తుంది

కొంతమంది సిరి సంపదలతో తులతూగుతూ వుంటారు. వాళ్లకి డబ్బుకు లోటు ఉండదు .. ఏదైతే కావాలనుకుంటారో వాళ్లు దానిని చాలా తేలికగా సొంతం చేసుకోగలుగుతారు. అయినా వాళ్లలో అశాంతి .. అసంతృప్తి కలుగుతూ ఉంటాయి. ఇక అంతగా సంపద లేకపోయినా .. ఎలాంటి వసతి సౌకర్యాలు లేకపోయినా కొంతమంది ఎంతో సంతోషంతో వుంటారు .. అందుకు కారణం సంతృప్తి అనే చెప్పాలి. కోరికలు మనసును .. మనిషిని పరుగులు తీయిస్తూ ఉంటాయి.

ఒక కోరిక నెరవేరితే మరో కోరిక  పుట్టుకోస్తూ ఉంటుంది. ఏదైనా కారణంగా ఆ కోరిక నెరవేరకపోతే మనసును అశాంతి అలుముకుంటుంది. ఆ కోరిక బలమైనదిగా మారిపోయి .. అది నెరవేరే అవకాశం కనిపించనప్పుడు జరిగే మానసిక సంఘర్షణ అనారోగ్యానికి కారణమవుతుంది. అన్నీ ఉన్నప్పటికీ అనారోగ్యం అనుభవించనీయకుండా చేసి .. మరింత బాధకి గురిచేస్తుంది. అత్యాశకి పోకుండా ఉన్నంతలో సంతృప్తి పడేవారి మనసుపై ఎలాంటి వత్తిడి పడదు. అందువలన వాళ్లు ఆరోగ్యంగా .. సంతోషంగా ఉండగలుగుతుంటారు. భగవంతుడు ఇచ్చింది ఇంతే .. ఇది చాలు అనే సంతృప్తి  సంతోషాన్ని కలిగిస్తుంది .. ఆ సంతోషమే ఆరోగ్యాన్ని ఇస్తుంది .. ఆయుష్షును పెంచుతుంది.        


More Bhakti News