ఇతరులకు సాయపడటంలోనే నిజమైన ఆనందం వుంది

చాలామంది తమ గురించి .. తమ కుటుంబసభ్యుల గురించి మాత్రమే ఆలోచన చేస్తుంటారు. ఇతరులు ఏమైపోతే మనకెందుకు అన్నట్టుగానే వ్యవహరిస్తూ వుంటారు. తమ కుటుంబసభ్యుల కోసం కష్టపడటంలో .. వాళ్లకి అన్ని విధాలుగా సహకరించడంలో ఆనందాన్ని పొందుతుంటారు. ఇతరులకు సాయం చేయడంలో అంతకుమించిన సంతోషం లభిస్తుందనేది మహానుభావుల మాట. కష్టాల్లో వున్నవారికి  అండగా నిలవడంలో .. సమస్యల్లో వున్నవారికి సాయపడటంలోని ఆనందం మాటల్లో చెప్పలేనిదనే విషయాన్ని ఎంతోమంది మహాభక్తులు స్పష్టం చేశారు.

తన భక్తులలోని మానవత్వానికి భగవంతుడు మరింతగా సంతోషిస్తాడనేది మహర్షుల మాట. ఒకసారి పాండురంగడి భక్తుడైన తుకారామ్ కి తన నగలన్నీ ఇచ్చి .. వాటిని అమ్మేసి ఆ వచ్చిన డబ్బుతో ఏదైనా వ్యాపారాన్ని ప్రారంభించమని ఆయన భార్య చెబుతుంది. ఆ నగలన్నీ అమ్మేయగా వచ్చిన డబ్బుతో తుకారామ్ వస్తూ, ఓ వ్యక్తిని రాజభటులు శిక్షిస్తూ ఉండటం చూస్తాడు. అప్పు తీర్చనందున రాజాజ్ఞ మేరకు శిక్షిస్తున్నట్టు తెలుసుకుంటాడు. ఎంతమాత్రం ఆలోచన చేయకుండా తన దగ్గరున్న డబ్బంతా చెల్లించి ఆ వ్యక్తిని రుణ విముక్తిడిని చేస్తాడు. ఆ డబ్బు తన కోసం కాకుండా .. ఇతరుల కోసం ఉపయోగపడటమే తనకి ఎక్కువగా ఆనందాన్ని కలిగిస్తోందని చెబుతాడు. అలా తుకారామ్ చేసిన సాయానికి ఆ పాండురంగడు ఎంతగానో సంతోషిస్తాడు.  


More Bhakti News