అందుకే భద్రాచలంలో హనుమంతుడి మూర్తి కనిపించదు

సీతారాములు కొలువైన పరమ పవిత్రమైన పుణ్యక్షేత్రాలలో 'భద్రాచలం' ఒకటిగా కనిపిస్తుంది. మేరు పర్వతపు కుమారుడైన 'భద్రుడు' ఇక్కడ తపస్సు చేసి శ్రీరాముడి సాక్షాత్కారం పొందాడు. అందువల్లనే ఈ క్షేత్రానికి భద్రుడు పేరు మీద భద్రాచలం అనే పేరు వచ్చింది. సాధారణంగా ఏ సీతారాముల ఆలయానికి వెళ్లినా, అక్కడ లక్ష్మణుడితోపాటు హనుమంతుడి మూర్తి తప్పకుండా దర్శనమిస్తూ ఉంటుంది. మరికొన్ని క్షేత్రాలలో భరత .. శత్రుఘ్నులు కూడా కొలువై వుంటారు.

కానీ భద్రాచలంలో మాత్రం సీతారాముల పాదాల చెంత హనుమ మూర్తి కానరాదు. అలాగే భరత .. శత్రుఘ్నులు కూడా కనిపించరు. అందుకు కారణం అది వనవాస సమయమనీ .. అప్పటికీ సీతారాములకు హనుమ పరిచయం కాలేదని స్థలపురాణం చెబుతోంది. సీత .. లక్ష్మణ సమేతుడైన శ్రీరాముడు మాత్రమే వనవాస సమయంలో ఈ ప్రదేశానికి వచ్చాడు. అలాగే ఆ స్వామి భద్రుడికి దర్శనమిచ్చాడు .. అలాగే అక్కడ కొలువైవుంటానని మాట ఇచ్చాడు. అందుకే ఇక్కడ సీతారామలక్ష్మణులు మాత్రమే దర్శనమిస్తూ వుంటారు. భక్తులకు సకల శుభాలను అనుగ్రహిస్తుంటారు.      


More Bhakti News