సహనానికి .. సమదృష్టికి మించిన సంపద లేదు

ఎవరైనా మనకి నచ్చని పని చేస్తే వాళ్లపై కోపగించుకోవడం చేస్తుంటాం. వాళ్లను నానామాటలు అనడమే కాకుండా దూరంగా ఉంచుతాం. అప్పటివరకూ మన నుంచి వాళ్లకి అందుతోన్న సాయాన్ని ఆపేస్తుంటాం. వాళ్ల నుంచి రావలసినవి ఏవైనా వుంటే వెంటనే ఇచ్చేయమంటూ వత్తిడి చేస్తుంటాం. తప్పు జరిగిపోయిందని వాళ్లు ఒప్పేసుకున్నా, ఒక పట్టాన పట్టువీడకుండా ప్రవర్తిస్తుంటాం. కానీ భగవంతుడు అలా కాదు .. అంత కోపం ఆయనకి రానేరాదు.

తనని ఎవరు నిందించినా .. దూషించినా భగవంతుడు మౌనంగానే ఉంటాడు. ఏదో ఒక కారణాన్ని చూపి తన ఆరాధనను దూరం పెట్టినా ఆయన ఆగ్రహించడు. అలాంటివారిని ఇబ్బంది పెట్టడానికి ఆయన ఏ విధంగానూ ప్రయత్నించడు. ఒక తల్లి తన బిడ్డలందరినీ ఎలా సమానంగా చూస్తూ ఉంటుందో, అంతే సమానంగా ఆయన అందరినీ చూస్తుంటాడు. దారి తప్పిన వాళ్లను సహనంతోనే ఆయన తన దారిలోకి తెచ్చుకుంటాడు. అజ్ఞానంతో చేసిన పనులను క్షమించి, హృదయమందిరంలో జ్ఞానమనే దీపాన్ని వెలిగిస్తాడు. తన తత్త్వాన్ని అర్థం చేసుకునే శక్తిని ప్రసాదించి .. సర్వ జీవుల పట్ల సమదృష్టిని ఎలా కలిగి ఉండాలనే విషయాన్ని గ్రహించేలా చేస్తాడు. సర్వశక్తిమంతుడైన భగవంతుడే అంతటి సహనంతో ఉంటున్నప్పుడు .. నిమిత్తమాత్రులమైన మనకు ఇంతటి ఆగ్రహావేశాలెందుకూ?        


More Bhakti News