సత్య ధర్మాలపట్లనే సదాశివుడి అనుగ్రహం

పరమేశ్వరుడు తన భక్తులను పరీక్షించి వారిని అనుగ్రహిస్తూ ఉంటాడు. అందుకు ఉదాహరణగా ఆధ్యాత్మిక గ్రంధాల్లో అనేక కథలు కనిపిస్తూ ఉంటాయి. పూర్వం 'నాభాగుడు' చిన్నతనంలోనే గురుకుల విద్యను అభ్యసించడానికి వెళ్లి .. యువకుడిగా తిరిగివస్తాడు. అయితే ఆయనకి ఆస్తిలో భాగం ఇవ్వకుండా సోదరులు మోసం చేస్తారు. అయినా తండ్రి బాగోగులు చూసుకుంటూ ఉంటాడు. ఆర్ధిక పరమైన ఇబ్బందులు ఎక్కువవుతూ ఉండటంతో, అక్కడికి సమీపంలో జరుగుతోన్న యాగం దగ్గరికి నాభాగుడు వెళతాడు.

యాగం చేస్తున్నవారికి సహకరించి .. వాళ్ల అనుమతి మేరకు యాగంలో మిగిలినవి తీసుకొస్తుంటాడు. అప్పుడు ఒక యక్షుడు అడ్డుపడి యాగములో మిగిలినవి తనకే దక్కుతాయని వాదిస్తాడు. ఆయనని నాభాగుడు తనతో పాటు ఆశ్రమానికి తీసుకు వచ్చి, న్యాయం చెప్పమని తండ్రిని అడుగుతాడు. ఆ యక్షుడికే అవి దక్కుతాయని తండ్రి చెప్పడంతో ఇచ్చేయడానికి నాభాగుడు సిద్ధపడతాడు. అప్పుడు ఆ యక్షుడు నిజరూపాన్ని పొంది పరమశివుడిగా దర్శనమిస్తాడు. అంతటి పేదరికంలోనూ సత్య ధర్మాలను ఆశ్రయించిన ఆ తండ్రీ కొడుకుల తీరు పట్ల సంతోషాన్ని వ్యక్తం చేస్తూ, సిరి సంపదలను అనుగ్రహిస్తాడు. 


More Bhakti News