శ్రీమద్భాగవతము .. ద్వాదశ స్కంధములు

శ్రీమద్భాగవతం శ్రీకృష్ణ పరమాత్ముని యొక్క లీలా విశేషాలను .. ఆయన తత్త్వాన్ని ఆవిష్కరిస్తూ ఉంటుంది. ద్వాదశ స్కంధాలతో శ్రీమద్భాగవతం దర్శనమిస్తూ ఉంటుంది. ఈ ద్వాదశ స్కంధాలను భగవంతుడి యొక్క అంగాలని ఆధ్యాత్మిక గ్రంధాలు చెబుతున్నాయి.

ప్రధమ .. ద్వితీయ స్కంధాలు భగవంతుడి పాదాలు, తృతీయ .. చతుర్ధ స్కంధాలు భగవంతుడి ఊరు భాగాలు. ఇక పంచమ స్కంధము భగవంతుడి 'నాభి' భాగం .. షష్ఠమ స్కంధము భగవంతుడి 'వక్ష స్థలం' .. సప్తమ - అష్టమ స్కంధాలు భగవంతుడి 'భుజాలు'. ఇక నవమ స్కంధం భగవంతుడి 'కంఠ' భాగంగాను .. దశమ స్కంధం భగవంతుడి 'ముఖ' భాగంగాను .. ఏకాదశ స్కంధము భగవంతుడి 'లలాట' భాగంగాను .. ద్వాదశ స్కంధం భగవంతుడి 'సహస్రార' భాగంగాను ఆధ్యాత్మిక గ్రంధాలు చెబుతున్నాయి. అలాంటి భాగవతాన్ని 7 రోజులలో పారాయణం చేయడం వలన విశేషమైన ఫలితాలు లభిస్తాయని ఆధ్యాత్మిక గ్రంధాలు స్పష్టం చేస్తున్నాయి.     


More Bhakti News