భక్తి శ్రద్ధల వల్లనే భగవంతుడి అనుగ్రహం

ఆధ్యాత్మిక జీవనప్రయాణంలో ప్రశాంతత చేకూరుతుంది .. భగవంతుడు తమయందు ఉన్నాడనే భరోసా కలుగుతుంది. ఉదయాన్నే తమ పూజా మందిరంలో పూజ చేసుకునేవాళ్లు కొందరైతే, మరికొంతమంది దగ్గరలోని ఆలయానికి వెళ్లి దైవదర్శనం చేసుకుంటూ వుంటారు. దైవారాధన వలన వివిధ దోషాలు నివారించబడి .. అనేక శుభాలు చేకూరుతూ ఉంటాయని ఆధ్యాత్మిక గ్రంధాలు చెబుతున్నాయి.

వినాయకుడిని పూజించడం వలన ఆటంకాలు తొలగిపోయి .. విజయాలు చేకూరతాయి. శివారాధన వలన జన్మజన్మల పాపాలు నశించి విశేషమైన పుణ్యఫలాలు లభిస్తాయి. విష్ణు పూజ వలన సిరిసంపదలను పొందడం జరుగుతుంది .. వైకుంఠ ప్రాప్తి కలుగుతుంది. లక్ష్మీ నరసింహస్వామిని పూజించడం వలన ఆపదలు తొలగిపోతాయి .. దుష్టశక్తుల పీడలు నివారించబడతాయి. హనుమంతుడికి ప్రదక్షిణలు చేయడం వలన ఆయురారోగ్యాలు చేకూరతాయి .. శని దోషాలు తొలగిపోతాయి. సుబ్రహ్మణ్యస్వామిని పూజించడం వలన సర్పదోషాలు నివారించబడతాయి. దుర్గాదేవిని పూజించడం వలన దుర్గతులు తొలగిపోతాయి .. దుఃఖం దూరమవుతుంది. భక్తి శ్రద్ధలతో పూజించేవారికి భగవంతుడి అనుగ్రహం ఎప్పుడూ ఉంటుందనేది మహర్షుల మాట.  


More Bhakti News