తులసి మాల .. రుద్రాక్ష మాల

చాలామంది ఉదయాన్నే పూజ చేసుకుని ఆ తరువాతనే తమ దైనందిన కార్యక్రమాలను ఆరంభిస్తూ వుంటారు. ఇష్టదేవతారాధన కారణంగా మనసు ప్రశాంతమవుతుంది. ప్రశాంతమైన మనసు మందిరంలో కొలువై ఉండటానికే భగవంతుడు ఇష్టపడతాడు. ఇక కొంతమంది అనునిత్యం 'జపం' కూడా చేసుకుంటూ వుంటారు. విష్ణు సంబంధమైన నామాన్ని జపించేవారు 'తులసిమాల'ను .. శివ సంబంధమైన నామాన్ని జపించేవారు 'రుద్రాక్షమాల'ను ఉపయోగించడం శ్రేష్టమని ఆధ్యాత్మిక గ్రంధాలు చెబుతున్నాయి.

 జపం చేసేవాళ్లు అనునిత్యం ఒకే సమయంలో చేయడానికే ప్రయత్నించాలి. పరిసరాలు పరిశుభ్రంగా .. మనసు ప్రశాంతంగా ఉంచాలి. 'జపం' చేసుకునేవారు మధ్యలో లేవడంగానీ .. ఇతరులతో మాట్లాడటం గాని చేయకూడదు. భగవంతుడి పాదాల చెంత మనసును సమర్పించకుండా చేసే 'జపం' వలన ప్రయోజనం వుండదు. 'జపం' సంగతి అటుంచితే తులసిమాలనుగానీ .. రుద్రాక్షమాలను గాని మాత్రమే మెడలో ధరించాలి. రెండు మాలలు కలిపి ధరించకూడదని ఆధ్యాత్మిక గ్రంధాలు స్పష్టం చేస్తున్నాయి.     


More Bhakti News