శ్రీరామచంద్రుడి వంశవృక్షం

శ్రీరామచంద్రుడు సూర్యవంశానికి చెందినవాడు. ఈ వంశంలో జన్మించినవారు ఎంతో పరాక్రమవంతులుగా .. త్యాగధనులుగా ప్రసిద్ధి చెందారు. లోక కల్యాణం కోసం వాళ్లంతా ఎంతగానో కృషి చేశారు. అలాంటివారి వంశంలో జన్మించిన శ్రీరామచంద్రుడు .. సాక్షాత్తు శ్రీమన్నారాయణుడిగా కొనియాడబడుతున్నాడు. ధర్మస్వరూపుడిగా నేటికీ ప్రజల మనసులో నిలిచిపోయాడు. అలాంటి రాముడి పూర్వీకుల గురించి తెలుసుకోవాలనే ఆసక్తి చాలామందిలో ఉంటుంది. బ్రహ్మ నుంచి శ్రీరామచంద్రుడి వంశ వృక్షం మొదలైనట్టుగా మనకి ఆధ్యాత్మిక గ్రంధాల్లో కనిపిస్తోంది.

 బ్రహ్మ .. మరీచి .. కాశ్యపుడు .. సూర్యుడు .. మనువు .. ఇక్ష్వాకువు .. కుక్షి .. వికుక్షి .. బాణుడు .. అనరణ్యుడు .. పృధువు .. త్రిశంఖుడు .. దుంధుమారుడు .. మాంధాత .. సుసంధి .. ధ్రువసంధి .. భరతుడు .. అశితుడు .. సగరుడు .. అసమంజసుడు .. అంశుమంతుడు .. దిలీపుడు .. భగీరథుడు .. కకుత్సుడు .. రఘువు .. ప్రవృర్ధుడు .. శంఖనుడు .. సుదర్శనుడు .. అగ్నివర్ణుడు .. శీఘ్రదుడు .. మరువు .. ప్రశిష్యకుడు .. అంబరీషుడు .. నహుషుడు .. యయాతి .. నాభాగుడు .. అజుడు .. దశరథుడు .. శ్రీరాముడు.  


More Bhakti News