ఇంద్ర వినాయకస్వామి ప్రత్యేకత అదే

తమిళనాడు ప్రాంతంలోని ప్రాచీనమైన క్షేత్రాల్లో 'సుచీంద్రం' ఒకటని ఆధ్యాత్మిక గ్రంధాలు చెబుతున్నాయి. సాక్షాత్తు దేవేంద్రుడే శాప విమోచనాన్ని పొందిన ఈ క్షేత్రం అనేక ఆలయాల సమాహారంగా కనిపిస్తుంది. ఇక్కడి ప్రతి ఆలయం ఏదో ఒక ప్రత్యేకతను సంతరించుకుని కనిపిస్తుంది. ఈ క్షేత్రంలో మూడు వినాయక విగ్రహాలు దర్శనమిస్తూ ఉంటాయి. ఒక వినాయకుడి ప్రతిమ తల భాగం పురుషుడుగాను .. మిగతా భాగం స్త్రీ రూపంలోను ఉంటుంది. అందువలన ఈ స్వామివారిని స్త్రీవినాయకుడు అంటారు.

ఆ తరువాత నీలకంఠ వినాయకుడు .. ఇంద్ర వినాయకుడు కూడా ఇక్కడే కొలువై కనిపిస్తారు. 'ఇంద్ర వినాయకుడు'ను సాక్షాత్తు ఇంద్రుడే పూజించాడట .. అందువల్లనే ఈ పేరు వచ్చిందని అంటారు. ఏ ఆలయంలోకి వెళ్లినా ముందుగా గణపతిని దర్శించుకుంటారు. కానీ ఈ క్షేత్రంలో ఇంద్ర వినాయకుడిని ఆలయంలో నుంచి వెళుతూ దర్శనం చేసుకోవడం విశేషం. ఈ ఇంద్ర వినాయకుడిని దర్శించుకోవడం వలన సమస్త దోషాలు తొలగిపోయి, సకల శుభాలు కలుగుతాయని భక్తులు విశ్వసిస్తుంటారు.           


More Bhakti News