మహా గుణ సంపన్నుడు శ్రీరామచంద్రుడు

శ్రీరాముడు మహా గుణ సంపన్నుడు .. ఎన్ని కష్టాలు ఎదురైనా ఆయన సత్య ధర్మాలను వీడలేదు. తాను ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నప్పటికీ సమస్త జీవులయందు దయను చూపాడు. ఇక తనకి సాయపడినవారిపట్ల కృతజ్ఞత చూపడంలో తనకి మరెవరూ సాటిలేరనిపించుకున్నాడు. సీతమ్మవారిని కాపాడటం కోసం రావణుడితో పోరాడి ప్రాణాలను వదిలిన 'జటాయువు'కి ఆయన ఉత్తమ గతులను కల్పించాడు.

అలాగే తన కోసం రావణ సైన్యంతో పోరాడి ప్రాణాలను కోల్పోయిన వానర సైన్యాన్ని చూసి ఆయన బాధపడతాడు. ఆ వానరులను బ్రతికించమని ఇంద్రుడిని ప్రార్ధించి .. వాళ్లు పునర్జీవితులయ్యేలా చేస్తాడు. అలాగే తనకి సహకరించిన సుగ్రీవుడికి .. విభీషణుడికి  ఇచ్చిన మాటను నిలబెట్టుకుంటాడు. కబంధుడు అనే రాక్షసుడిని సంహరించి .. ఆయనకి అగ్ని సంస్కారం నిర్వహించి .. ఉత్తమ గతులను కలిగిస్తాడు. బలహీనులను సైతం గౌరవించే గొప్పగుణం శ్రీరాముడి సొంతం. ఆయన ధర్మ స్వరూపుడే కాదు .. దయా స్వరూపుడు కూడా. అందుకే ప్రతి మనసు మందిరంలో కొలువై ప్రతి నిత్యం పూజలందుకుంటున్నాడు.   


More Bhakti News