రామ నామం స్మరిస్తే చాలు

రాముడు ధర్మస్వరూపుడు .. దయా స్వరూపుడు .. అణువణువునా ఆధ్యాత్మిక పరిమళాలను వెదజల్లే ఆనంద స్వరూపుడు. అలాంటి రాముడి దర్శనం .. రామ నామ స్మరణం సమస్త పాపాలను పటాపంచలు చేస్తాయని ఆధ్యాత్మిక గ్రంధాలు చెబుతున్నాయి. రామ నామానికే తారక మంత్రమని పేరు. తరింపజేసేదే తారక మంత్రమనేది మహర్షుల మాట. రామ అనే శబ్దానికి చక్రవర్తి .. దుఃఖాన్ని దూరం చేసేవాడు .. ఆయురారోగ్యాలను ప్రసాదించేవాడు అనే అర్థాలు వున్నాయి.

 అందువల్లనే రామ నామం మహా శక్తిమంతమైనదని ఆధ్యాత్మిక గ్రంధాలు చెబుతున్నాయి. రామ నామ స్మరణ వలన పాపాలు .. శాపాలు .. దోషాలు .. ఆపదల నుంచి విముక్తిని పొందిన భక్తులు ఎంతోమంది వున్నారు. పోతన .. త్యాగయ్య .. శబరీ .. భద్రుడు .. రామదాసు .. తులసీదాసు .. ఇలా ఎంతోమంది భక్తులు అనుక్షణం ఆ స్వామి నామాన్ని జపిస్తూ ధన్యత పొందారు. రామ నామ వైభవాన్ని జనంలోకి తీసుకెళ్లారు. ఇలా ఎంతోమంది భక్తుల ప్రేరణ కారణంగానే, ఊరూరా రామాలయాలు దర్శనమిస్తున్నాయి .. రామనామ సంకీర్తనలు వినిపిస్తున్నాయి.   


More Bhakti News