అందుకే భద్రాద్రి రాముడికి వైకుంఠ రాముడని పేరు

రామాయణాన్ని పారాయణం చేస్తున్నా .. శ్రవణం చేస్తున్నా .. రామాయణ ఘట్టాలకి సంబంధించిన ప్రదేశాలను చూస్తున్నా అనిర్వచనీయమైన అనుభూతిని పొందని భక్తులంటూ వుండరు. అలా శ్రీరామచంద్రుడు ఆవిర్భవించిన పరమ పవిత్రమైన ప్రాచీన క్షేత్రాల్లో ఒకటిగా 'భద్రాచలం' దర్శనమిస్తూ ఉంటుంది. ఇక్కడి రాముడు నాలుగు భుజాలతో .. అపసవ్య దిశలో శంఖు చక్రాలను ధరించి కనిపిస్తాడు. శ్రీరాముడు ఈ విధంగా ఇక్కడ కొలువై ఉండటానికి కారణం ఆయన భక్తుడైన 'భద్రుడు' అని స్థలపురాణం చెబుతోంది.

రామావతారం పూర్తయిన తరువాత ఆ స్వామి శ్రీమన్నారాయణుడిగా వైకుంఠానికి చేరుకుంటాడు. సీతా లక్ష్మణ సమేతంగా తన శిరస్సు పై కొలువై వుండమంటూ భద్రుడు కఠోర తపస్సు చేస్తుంటాడు. ఆ తపస్సును ఆపడానికి స్వామి వైకుంఠం నుంచి ఆత్రుతగా వచ్చాడట. అందువల్లనే నాలుగు భుజాలతో .. అపసవ్య దిశలో శంఖు చక్రాలతో కనిపిస్తాడని కథనం. పర్వత రూపంలోని భద్రుని శిరస్సుపై .. సీతా లక్ష్మణ సమేతంగా కొలువైన స్వామిని, వైకుంఠ రాముడనీ .. రామనారాయణుడనీ .. గిరి నారాయణుడని భక్తులు పిలుచుకుంటూ వుంటారు. ఆ స్వామిని దర్శించి ధన్యులవుతుంటారు.   


More Bhakti News