హిరణ్యకశిపుని వధ ఇక్కడే జరిగిందట

హిరణ్యకశిపుడు తన కుమారుడైన ప్రహ్లాదునిచే 'హరి' నామ స్మరణను మాన్పించడానికి ఎన్నో రకాలుగా ప్రయత్నిస్తాడు. ఆయన ప్రయత్నాలన్నీ విఫలం చేసిన ప్రహ్లాదుడు .. శ్రీమన్నారాయణుడు లేని ప్రదేశమే లేదనే విషయాన్ని స్పష్టం చేస్తాడు. 'అయితే ఈ స్థంభం నందు వున్నాడా నీ శ్రీహరి' అంటూ దానిని 'గద'తో బలంగా మోదుతాడు. ప్రహ్లాదుడి విశ్వాసాన్ని నిలబెట్టడం కోసం .. లోక కల్యాణం కోసం శ్రీమన్నారాయణుడు ..నృసింహ అవతారంతో ఆ స్థంభంలో నుంచి వచ్చి, హిరణ్య కశిపుడిని వధిస్తాడు.

ఈ సంఘటన జరిగినది 'అహోబిలం' క్షేత్రంలోనేనని స్థల పురాణం చెబుతోంది.  ఈ క్షేత్రంలో 'జ్వాలా నృసింహస్వామి' ఆలయం దర్శనమిస్తూ ఉంటుంది. ఈ ప్రదేశంలోనే 'హిరణ్యకశ్యపుని వధ' జరిగిందని అంటారు. హిరణ్య కశిపుని సంహరిస్తూనే స్వామివారి మూర్తి అష్ట భుజాలతో దర్శనమిస్తూ ఉంటుంది. ఇక్కడే ఒక నీటి గుండం కనిపిస్తూ ఉంటుంది. హిరణ్య కశిపుడిని సంహరించిన అనంతరం స్వామివారు తన చేతులను ఈ గుండంలో కడిగారని చెబుతారు. అందుకు నిదర్శనంగా ఇప్పటికీ ఈ గుండంలో నీరు ఎర్రగా కనిపిస్తూ ఉండటం విశేషం.  


More Bhakti News