పుణ్యఫలాలను అందించే పరమేశ్వరుడు

 పరమశివుడు అనేక క్షేత్రాల్లో లింగరూపంలో ఆవిర్భవించి .. అనేక నామాలతో పూజాభిషేకాలు అందుకుంటూ ఉంటాడు. పంచముఖాలతో కూడిన పరమేశ్వరుడిని 'పశుపతి' అని అంటారు. పశ్చిమం వైపుగా సద్యోజాత ముఖం .. ఉత్తరం వైపుగా వామదేవ ముఖం .. దక్షిణం వైపుగా అఘోర ముఖం .. తూర్పు వైపుగా తత్పురుష ముఖం .. ఊర్థ్వ దిశగా ఈశాన ముఖం కలిగివుంటాడు.

'ఓం నమః శివాయ ' అనే పంచాక్షరీ మంత్రానికి తగినట్టుగానే ఆ స్వామి పంచభూత స్వరూపుడిగా దర్శనమిస్తూ ఉంటాడు. కంచిలో 'పృథ్వీ లింగం' .. చిదంబరంలో 'ఆకాశలింగం '..  జంబుకేశ్వరంలో 'జలలింగం'.. అరుణాచలంలో 'అగ్నిలింగం' .. శ్రీకాళహస్తిలో 'వాయులింగం'గా స్వామి పూజాభిషేకాలు అందుకుంటూ అనుగ్రహిస్తుంటాడు. ఇక 'పంచారామాలు 'లోను స్వామివారు భీమేశ్వరుడు .. సోమేశ్వరుడు .. అమరేశ్వరుడు .. క్షీర రామేశ్వరుడు .. కుమార లింగేశ్వరుడుగా ఆవిర్భవించి ఆరాధించబడుతూ ఉంటాడు. అలాంటి పరమేశ్వరుడిని పంచామృతాలతో అభిషేకించడం వలన, అనంతమైన పుణ్య ఫలాలు లభిస్తాయని ఆధ్యాత్మిక గ్రంధాలు చెబుతున్నాయి.          


More Bhakti News