ఉజ్జయిని మహాకాళేశ్వరుడు

పరమశివుడు ఆవిర్భవించిన పరమ పవిత్రమైనవిగా .. మహిమాన్వితమైనవిగా జ్యోతిర్లింగ క్షేత్రాలు వెలుగొందుతున్నాయి. ఒక్కో జ్యోతిర్లింగాన్ని దర్శించుకోవడం వలన ఒక్కో విశేషమైన ఫలితం లభిస్తుందని ఆధ్యాత్మిక గ్రంధాలు చెబుతున్నాయి. అలాంటి జ్యోతిర్లింగాలలో ఉజ్జయినిలో వెలసిన జ్యోతిర్లింగం ప్రత్యేకతను సంతరించుకుని కనిపిస్తుంది. ఇక్కడి స్వామి 'మహా కాళేశ్వరుడు'గా పూజాభిషేకాలు అందుకుంటూ ఉంటాడు.

 పూర్వం శివభక్తుడైన ఓ బ్రాహ్మణుడిని ఒక రాక్షసుడు చంపడానికి ప్రయత్నించగా, ఆ బ్రాహ్మణుడు పరమశివుడిని ప్రార్ధించాడట. దాంతో ఆ స్వామి ప్రత్యక్షమై ఆ రాక్షసుడిని సంహరించి, ఆ బ్రాహ్మణుడి ఇంట్లోనే కొలువయ్యాడనేది ఒక కథనం. ఇక్కడి 'శిప్రా నది'లో స్నానం చేసి .. మహా కాళేశ్వరుడిని దర్శించుకోవడంవలన సమస్త పాపాలు నశించి, మనసులోని ధర్మబద్ధమైన కోరికలు నెరవేరతాయని విశ్వసిస్తుంటారు. ఇక్కడి అమ్మవారు 'మాహాకాళిక' పేరుతో పూజలు అందుకుంటూ ఉంటుంది. అమ్మవారి శక్తి పీఠాలలోను ఈ క్షేత్రం ఒకటికావడం విశేషం.     


More Bhakti News