మార్కండేయుడు చంద్రశేఖరాష్టకం ఆశువుగా చెప్పింది ఇక్కడే

పరమశివుడు కొలువైన పరమ పవిత్రమైన పుణ్య క్షేత్రాల్లో 'మార్కొంపోడు' ఒకటిగా కనిపిస్తుంది. ఆహ్లాదకరమైన ప్రదేశంలో ఆధ్యాత్మిక పరిమళాలను వెదజల్లుతూ ఈ క్షేత్రం అలరారుతోంది. పశ్చిమ గోదావరి జిల్లాలోని 'నిడదవోలు' పరిథిలో ఈ ప్రాచీన క్షేత్రం అలనాటి వైభవానికి అద్దం పడుతూ ఉంటుంది. ఇక్కడి శివలింగాన్ని మృకండ మహర్షి ప్రతిష్ఠించాడని స్థలపురాణం చెబుతోంది.

 అనునిత్యం ఈ శివలింగానికి మృకండ మహర్షి పూజాభిషేకాలు జరుపుతూ తరించేవాడట. ఆయన కుమారుడైన మార్కండేయుడు కూడా అత్యంత భక్తి శ్రద్ధలతో ఈ శివలింగాన్ని ఆరాధించినట్టు ఆధ్యాత్మిక గ్రంధాలు చెబుతున్నాయి. ఈ కారణంగానే ఇక్కడి స్వామివారిని 'మార్కండేయ స్వామి'గా కొలుస్తూ వుంటారు. స్వామి అనుగ్రహంతో దీర్ఘాయువును పొందిన మార్కండేయుడు, చంద్రశేఖరాష్టకాన్ని ఆశువుగా చెప్పింది ఇక్కడి శివలింగ సన్నిధిలోనేనని అంటారు.      


More Bhakti News