మాఘ పౌర్ణమి రోజున సముద్ర స్నాన ఫలితం

సంవత్సరంలో 11వ మాసంగా 'మాఘమాసం' కనిపిస్తుంది. ఈ మాసంలో పౌర్ణమి రోజున 'మఖ' నక్షత్రం ఉండటం వలన, మాఘ మాసంగా పిలుస్తుంటారు. మాఘ మాసం అనేక విశేషాల సమాహారమని చెప్పాలి. అత్యంత పవిత్రమైనవిగా చెప్పబడే మాసాలలో 'మాఘమాసం' ఒకటనే విషయాన్ని ఆధ్యాత్మిక గ్రంధాలు చెబుతున్నాయి.

మాఘ మాసంలోని విశేషమైన రోజుల్లో 'మాఘ పౌర్ణమి' ఒకటి. దీనినే 'మహా మాఘి' అని అంటారు. ఈ రోజున చేసే స్నాన .. దాన .. జపాలు విశేషమైన ఫలితాలను ఇస్తాయి. కాలువల్లో .. చెరువుల్లో .. నదుల్లో చేసే స్నానం ఎంతో పుణ్యప్రదం. ఇక సముద్ర స్నానం మరింత విశేషం. సముద్ర స్నానం అనేక జన్మల పాపాలను హరించి వేసి, పుణ్యరాశిని పెంచుతుంది. అందువలన ఈ రోజున స్నాన .. దాన .. జపాలకు ప్రాధాన్యత ఇవ్వాలని సాక్షాత్తు ధర్మరాజుకు శ్రీ కృష్ణుడు చెప్పినట్టుగా ఆధ్యాత్మిక గ్రంధాల్లో కనిపిస్తుంది.        


More Bhakti News