దృష్టి దోష నివారణకు ఇలా చేయవచ్చు

పిల్లలు ఎక్కడికైనా వెళ్లి వచ్చినా .. వాళ్లకి సంబంధించిన వేడుకలు ఏవైనా నిర్వహించినా, దిష్టి తగలకుండా పెద్దలు తమకి తెలిసిన పద్ధతులను పాటిస్తుంటారు. ఉప్పు .. చెప్పు .. చీపురు తిప్పేసేవాళ్లు కొందరైతే, నూనె గుడ్డను కాల్చేసి తిప్పేసేవాళ్లు మరికొందరు. ఇక చిన్న పిల్లలకి దిష్టి తగలకుండా నుదుటున .. బుగ్గపైన .. అరికాలులోను కాటుకతో బొట్టు మాదిరిగా గుండ్రంగా దిద్దుతుంటారు. దిష్టి తగిలిన వాళ్లకి తలనొప్పి .. వికారంగా అనిపించడం .. వాంతులు కావడం వంటివి జరుగుతూ ఉంటాయి.

అలా ఇబ్బంది పెట్టే దృష్టి దోషం నుంచి బయటపడటానికి ఆధ్యాత్మిక గ్రంధాలు మరో మార్గం కూడా చెబుతున్నాయి. శనివారం రోజున హనుమంతుని ఆలయానికి వెళ్లి ఆయనకు పూజ చేయించాలి. ఆ తరువాత స్వామివారి నుంచి కొంత సిందూరం తీసుకుని వచ్చి, దిష్టి తగిలిన వారి నుదుటున పెట్టాలి. ఈ విధంగా చేయడం వలన దృష్టి దోషం తొలగిపోతుందట. అందువలన దృష్టి దోషంతో బాధపడుతున్నామని గ్రహించినవారు, హనుమంతుడి ప్రతిమ నుంచి తీసిన సిందూరాన్ని ధరించడం వలన వెంటనే ఉపశమనం కలుగుతుంది.    


More Bhakti News