ఆర్థికపరమైన బాధల నుంచి ఇలా విముక్తిని పొందవచ్చు

జీవితంలో ఎవరికి ఉండవలసిన ఇబ్బందులు వారికి వుంటాయి. సమస్య ఏదైనా అది మనసుకు కష్టాన్ని కలిగిస్తూనే ఉంటుంది .. ఆందోళనకి గురిచేస్తూనే ఉంటుంది. ఇక ఆర్ధిక పరమైన సమస్య అయితే మరింతగా కుంగదీస్తూ ఉంటుంది. అవసరానికి సరిపడా ధనం లేనప్పుడు .. అవసరానికి తగిన సంపాదన లేనప్పుడు ఆర్థికపరమైన సమస్యలు వెంటాడుతూ ఉంటాయి. ఆపదలు .. అత్యవసరాలు వచ్చినప్పుడు ఈ సమస్య మరింత పెద్దదిగా కనిపిస్తూ ఉంటుంది .. అగాధంలా అనిపిస్తూ ఉంటుంది.

అలాంటి పరిస్థితి నుంచి విముక్తిని పొందడానికి స్వయంకృషి అవసరం .. అందుకు భగవంతుడి అనుగ్రహం తోడవడం అవసరం. లక్ష్మీదేవి అనుగ్రహం వలన సంపదలు చేకూరతాయి .. ఫలితంగా ఆర్ధిక పరమైన ఇబ్బందులు దూరమవుతాయి. బ్రాహ్మీ ముహూర్తంలో శ్రీ మహావిష్ణువును పూజించడం .. 'గజేంద్రమోక్షం' పారాయణ చేయడం లక్ష్మీదేవికి ఎంతో ఇష్టమట. అలా అమ్మవారు ప్రీతిచెందేలా చేయడం వలన పాపాలు నశించి పుణ్య ఫలాలు చేకూరతాయి. ఆటంకాలు తొలగిపోయి సంపాదనకు అనుకూలమైన పరిస్థితులు ఏర్పడతాయి. ఆ తల్లి అనుగ్రహంతో సంపద వృద్ధి చెందుతుందని ఆధ్యాత్మిక గ్రంధాలు చెబుతున్నాయి.    


More Bhakti News