పరశురామ జయంతి .. ఆయన నామ స్మరణ ఫలితం

పరశురామ జయంతి .. ఆయన నామ స్మరణ ఫలితం
అవతార పురుషుడైన పరశురాముడు .. రేణుకా దేవి .. జమదగ్నిల కుమారుడు. మహా పరాక్రమవంతుడైన పరశురాముడు తన తల్లిదండ్రులతో కలిసి ఆశ్రమ జీవితాన్ని కొనసాగిస్తూ ఉండేవాడు. ఓ సారి ఆయన ఆశ్రమంలో లేనప్పుడు హయహయుడనే రాజు .. జమదగ్ని మహర్షి ఆశ్రమానికి వస్తాడు. కామధేనువు కోసం జమదగ్ని మహర్షిని వధించి వెళతాడు. విషయం తెలుసుకున్న పరశురాముడు ఆగ్రహోదగ్రుడవుతాడు. క్షత్రియ జాతినంతా సమూలంగా నాశనం చేస్తానని ఆ సమయంలోనే ప్రతిజ్ఞ చేస్తాడు.

 భృగు మహర్షి తన మంత్ర జలంతో జమదగ్ని మహర్షిని బ్రతికించినప్పటికీ, పరశురాముడు తాను చేసిన శపథం ప్రకారం క్షత్రియులపై 21 మార్లు దండెత్తి వాళ్లను సంహరిస్తాడు. ఆ పాపాన్ని పోగొట్టుకునేందుకుగాను ఆయన అనేక పుణ్య క్షేత్రాలను దర్శిస్తూ, శివలింగ ప్రతిష్ఠలు చేస్తూ వెళ్లాడు. ఈ కారణంగానే చాలా పుణ్య క్షేత్రాల్లో పరశురాముడు ప్రతిష్ఠించిన శివలింగాలు దర్శనమిస్తుంటాయి. అలాంటి పరశురాముడిని ఆయన జయంతి రోజున స్మరించుకోవడం వలన, తలపెట్టిన కార్యాలు ఎలాంటి ఆటంకాలు లేకుండగా పూర్తవుతాయని ఆధ్యాత్మిక  గ్రంధాలు చెబుతున్నాయి.    

More Bhakti Articles