కార్తీక పౌర్ణమి రోజున జ్వాలా తోరణోత్సవం

కార్తీక పౌర్ణమి పరమశివుడికి ఎంతో ప్రీతికరమైనదిగా చెప్పబడుతోంది. ఈ రోజున శివాలయాలలో 'జ్వాలా తోరణోత్సవం' నిర్వహిస్తూ వుంటారు. కార్తీక పౌర్ణమిని 'త్రిపుర పౌర్ణమి' అని కూడా పిలుస్తుంటారు. సదాశివుడు .. త్రిపురాసురాలను సంహరించింది ఈ రోజునే. అందుకే ఈ పౌర్ణమిని 'త్రిపుర పౌర్ణమి' అని కూడా పిలుస్తుంటారు.

పరమ శివుడు త్రిపురాసురులను సంహరించి తిరిగి వస్తుండగా, ఆ స్వామి విజయానికి గుర్తుగా .. ఆయనకి దృష్టి దోషం తగలకుండగా పార్వతీదేవి ఈ రోజున 'జ్వాలా తోరణోత్సవం' నిర్వహించిందని కథనం. ఈ కారణంగానే ఈ రోజున దేవాలయాలలో 'జ్వాలా తోరణోత్సవం' జరుపుతుంటారు. 'జ్వాలా తోరణోత్సవం' దర్శించడం వలన సమస్త పాపాలు నశిస్తాయనీ .. అకాల మృత్యు దోషం నివారించబడుతుందని ఆధ్యాత్మిక గ్రంధాలు చెబుతున్నాయి. ఈ రోజున స్త్రీలు ఉపవాస దీక్షను చేపట్టి .. సాయంకాలం శివాలయంలో దీపాలు వెలిగించాలి. ఉసిరిక చెట్టు కింద దీపాలు వెలిగిస్తే విశేషమైన పుణ్య ఫలాలు లభిస్తాయనేది శాస్త్రవచనం.           


More Bhakti News