రుషికేష్
భగవంతుడు ప్రకృతి ప్రేమికుడిగా కనిపిస్తాడు. తన సృష్టిలోని సౌందర్యానికి తానే మురిసిపోతూ ఆ ప్రకృతి ఒడిలో సేదదీరుతుంటాడు. ఆయన అక్కడ ఉన్నాడనే పూర్తి విశ్వాసంతో, ప్రయాణంలోని కష్టనష్టాలను సైతం లెక్కచేయక వెళ్లినవారిని అనుగ్రహిస్తూనే ఉంటాడు. అలా అందమైన ప్రకృతి నడుమ ఆహ్లాదకరమైన వాతావరణంలో సదాశివుడు వెలసిన పవిత్ర పర్వత ప్రదేశమే 'హృషీ కేష్'. కాలక్రమంలో ఈ పేరు 'రుషి కేష్'గా మారిపోయింది.
ఎంతో విశిష్టమైనటువంటి ఈ పుణ్య క్షేత్రం ఉత్తరప్రదేశ్ - హరిద్వార్ సమీపంలో అలరారుతోంది. పూర్వం సదాశివుడి భక్తుడైన రైభ్య మహర్షి పరమశివుడి కోసం తపస్సు చేయగా, ఆయన కోరికపై శివుడు ఇక్కడ వెలసినట్టు చెబుతారు. ఈ కారణంగానే ఈ ప్రదేశం ఋషికేష్ గా ప్రసిద్ధి చెందింది. ఇక్కడి పర్వత ప్రాంతం చూడగానే ఇది దేవభూమి అని తెలిసిపోతుంది.
గంగానదీ తీరంలో ప్రశాంతతకు ... పవిత్రతకు పెట్టింది పేరుగా ఉన్నందునే శ్రీ రాముడు సోదరుడైన భరతుడు ఇక్కడ తపస్సు చేసినట్టుగా చెబుతారు. అందుకు నిదర్శనంగా మనకి ఇక్కడ భరతుడి ఆలయం కనిపిస్తుంది. ఇక్కడ గంగను దాటడానికి ఇనుప తీగలతో నిర్మించిన వంతెనను 'లక్ష్మణ్ ఝాలా' అని పిలుస్తుంటారు. గంగలో స్నానమాచరించి పరమశివుని పాదాల చెంత మనసును ఉంచడానికి ప్రతియేటా వేలాదిమంది భక్తులు ఇక్కడికి వస్తుంటారు. ప్రకృతి మాత అయిన పార్వతీదేవి ఒడిలో సేదతీరుతోన్న పరమేశ్వరుడిని దర్శించి ధన్యులు అవుతుంటారు.