హనుమ ఇలా ప్రీతి చెందుతాడట!

కొన్ని చోట్ల రామాలయాలలో రాముడితో పాటు దర్శనమిచ్చే హనుమంతుడు, మరికొన్ని చోట్ల తానే ప్రధాన దైవంగా కొలువై అనుగ్రహిస్తుంటాడు కూడా. వీరాంజనేయుడు .. యోగాంజనేయుడు .. భక్తాన్జనేయుడు .. ధ్యానాంజనేయుడు .. దాసాంజనేయుడు .. ఇలా వివిధ నామాలతో స్వామి భక్తులచే పూజాభిషేకాలు అందుకుంటూ ఉంటాడు.

హనుమంతుడికి సిందూర అభిషేకం అంటే ఎంతో ఇష్టం .. అలాగే ఆకుపూజ అంటే కూడా ఆయనకి ఎంతో ప్రీతి. ఇక తీపి అప్పాలు .. వడలు అన్నా ఆయనకి ప్రాణం. హనుమంతుడి దర్శనం చేసుకున్న భక్తులు 11 ప్రదక్షిణలు చేయాలి. ఆ తరువాత ఆయనకి సిందూరం అభిషేకం .. ఆకుపూజ చేయించి, నైవేద్యంగా అప్పాలు .. వడలు సమర్పించాలి. ఈ విధంగా చేయడం వలన ఆయన ప్రీతి చెందుతాడు.  హనుమ అనుగ్రహం వలన భయాలు .. బాధలు .. అనారోగ్యాలు .. ఆర్థికపరమైన ఇబ్బందులు తొలగిపోతాయని ఆధ్యాత్మిక గ్రంధాలు చెబుతున్నాయి. గ్రహ సంబంధమైన దోషాలు కూడా తొలగిపోయి, ఆనందకరమైన జీవితం లభిస్తుందని స్పష్టం చేస్తున్నాయి.           


More Bhakti News