కాలం ఎంతో అమూల్యమైనది

కాలం కలిసి రావాలి .. కాల మహిమ .. మన చేతిలో ఏవుంది? వంటి మాటలను మనం పెద్దల నోటివెంట వింటూ ఉంటాం. నిజంగానే కాలం అమూల్యమైనది .. గడచిన కాలం ఎన్ని విధాలుగా ప్రయత్నించినా తిరిగి రాదు. అందువల్లనే కాలాన్ని వృథా చేయకూడదు. కాల మహిమను గుర్తించి నడచుకోవడం ప్రతి ఒక్కరి కర్తవ్యం. కాలం చాలా విలువైనదని తెలియని అజ్ఞానులు, సోమరితనంతో దానిని వృథా చేస్తుంటారు. తాము చేయవలసిన పనులను .. నిర్వహించవలసిన బాధ్యతలను పక్కన పెట్టేస్తుంటారు. వ్యర్థమైన మాటలతో .. పగటి నిద్రతో .. అనవసరమైన కార్యకలాపాలతో కాలాన్ని వృథా చేస్తుంటారు. ఆ తరువాత తమ నిర్లక్ష్యానికి తగిన మూల్యాన్ని చెల్లిస్తుంటారు.

 విజ్ఞులు మాత్రం కాలంతో పాటు పరిగెత్తడానికి ప్రయత్నిస్తుంటారు. కొన్ని పనులను సకాలంలోనే పూర్తి చేయాలి .. లేదంటే జరగరాని నష్టం జరిగిపోతుంది. అందువలన కాల మహిమను తెలుసుకుని తమ బాధ్యతలను నిర్వహిస్తూ వుంటారు .. ఆధ్యాత్మిక పరంగాను ఉన్నతిని పొందుతుంటారు. కాలాన్ని సద్వినియోగం చేసుకున్నప్పుడే లక్ష్యాలను చేరుకోవడం .. విజయాలను సాధించడం జరుగుతుందనే విషయాన్ని మరిచిపోకూడదు.      


More Bhakti News