వరలక్ష్మీదేవి అనుగ్రహమే కావలసింది!
జీవితంలో కష్టాలు .. నష్టాలు ఎవరికైనా ఎదురవుతూనే ఉంటాయి. కొన్ని ఆరోగ్యపరమైనవైతే .. మరికొన్ని ఆర్ధిక పరమైనవి. ఈ సమస్యలు అందరినీ సతమతం చేస్తుంటాయి .. మనశ్శాంతి లేకుండా చేస్తూ .. మనో నిగ్రహం కోల్పోయేలా చేస్తుంటాయి. అలాంటివాటి నుంచి బయటపడటానికి సాయపడేదే వరలక్ష్మీ అమ్మవారని ఆధ్యాత్మిక గ్రంధాలు చెబుతున్నాయి. సకల సౌభాగ్యాలను ప్రసాదించేది ఆ తల్లి అనుగ్రహమేనని స్పష్టం చేస్తున్నాయి.
శ్రావణ మాసంలో పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారం రోజున వరలక్ష్మీదేవిని ఆరాధించడం వలన విశేషమైన ఫలితాలు కలుగుతాయి. ఈ రోజున ఇంట్లోని తూర్పు భాగంలో పీఠంపై అమ్మవారిని వుంచి, తొమ్మిది పోగుల తోరమును ధరించి, నియమ నిష్ఠలతో వ్రతాన్ని ఆచరించవలసి ఉంటుంది. అమ్మవారికి ఇష్టమైన పూలు .. ప్రీతికరమైన నైవేద్యాలు సమర్పించవలసి ఉంటుంది. ఎంతటి అంకితభావంతో ఆ తల్లిని సేవిస్తే అంతటి ఉత్తమమైన ఫలాలు లభిస్తాయని, సాక్షాత్తు పరమశివుడే పార్వతీదేవికి చెప్పాడట. అలాంటి వరలక్ష్మీ దేవి అనుగ్రహాన్ని పొందే అవకాశాన్ని ఎలాంటి పరిస్థితుల్లోను వదులుకోకూడదు.