ఓంకారేశ్వర్
'ఓంకారేశ్వర క్షేత్రం'మధ్యప్రదేశ్ - ఇండోర్ సమీపంలో అలరారుతోంది. ఇక్కడ కావేరి - నర్మద నదీ సంగమ ప్రాంతంలో పరమశివుడు జ్యోతిర్లింగంగా అవతరించాడు. ఈ ద్వీపం 'ఓం'అనే ఆకారంలో వుండటం వలన ఇక్కడి స్వామికి 'ఓంకారేశ్వరుడు'అనే పేరు వచ్చింది. దానవులను అంతం చేయడానికి దేవతల కోరిక పై వెలసిన కారణంగా, సదాశివుడిని 'ఓంకార అమరేశ్వరుడు'గా కూడా పిలుస్తుంటారు. అగస్త్యాది మహర్షులు పరమ పవిత్రమైన ఈ ప్రదేశంలో ఉంటూ శివయ్యను ఆరాధించినట్టుగా ఆధారాలు కనిపిస్తాయి.
ఇక్కడి గర్భాలయంలో లింగ రూపంలోని స్వామివారికి ఎదురుగా అమ్మవారు కొలువుదీరి కనిపిస్తుంది. ఇక శివలింగ పాదభాగం కింద నుంచి నర్మదా నది ప్రవహిస్తూ ఉంటుందని చెబుతారు. ఈ క్షేత్రానికి వచ్చిన వారు ఆది దంపతులతో పాటు పంచముఖ వినాయకుడిని దర్శించి తరించవచ్చు.
ఇక ఖేడాపతి హనుమంతుడి మందిరం ... సూర్య చంద్రుల ద్వారాలు ... భీమార్జున ద్వారాలు ... ఆదిశంకరా చార్యుల వారి గుహ ఆనాటికాలాన్ని కళ్ల ముందుంచుతూ, అనిర్వచనీయమైన అనుభూతిని కలిగిస్తూ ఉంటాయి. ఆధ్యాతిక పరిమళాలను వెదజల్లే ఈ క్షేత్రం ఒకసారి దర్శించినంత మాత్రాన్నే మోక్షాన్ని ప్రసాదిస్తుందని పురాణాల్లో స్పష్టంగా చెప్పడం జరిగింది.