దుర్గాదేవి నామాన్ని స్మరిస్తే చాలు

దుర్గాదేవి నామాన్ని స్మరిస్తే చాలు
దుష్ట శిక్షణ .. శిష్ట రక్షణ చేయడానికి ఆది పరాశక్తియే దుర్గాదేవిగా ఆవిర్భవించింది. పగటి వేళలో సూర్య నేత్రంతోను .. సంధ్యా సమయంలో అగ్ని నేత్రంతోను .. రాత్రి సమయంలో చంద్ర నేత్రంతోను ఆ తల్లి లోకాలను దర్శిస్తూ ఉంటుంది. ఆ మహా శక్తి స్వరూపిణి అధీనంలోనే ప్రకృతి శక్తులన్నీ నడుస్తుంటాయి. సమస్త దేవతా స్వరూపమైన దుర్గాదేవిని దేవతలు .. మహర్షులు అనునిత్యం పూజిస్తుంటారు. ఎంతోమంది మహా భక్తులు ఆ తల్లిని సేవించి తరించారు.

 అలాంటి ఆ తల్లి నామాన్ని అనునిత్యం స్మరించడం వలన, సమస్త పాపాలు హరించబడతాయి. ఆపదలో వున్నవారు దుర్గా నామాన్ని స్మరించడం వలన, వాటి నుంచి గట్టెక్కుతారు. అనారోగ్యాలతోను .. ఆర్ధికపరమైన సమస్యలతోను ఇబ్బందులు పడుతున్నవాళ్లు, ఆ తల్లి నామాన్ని స్మరించడం వలన వాటి నుంచి విముక్తిని పొందుతారు. దుర్గా నామాన్ని స్మరించడం వలన గ్రహసంబంధమైన దోషాలు కూడా తొలగిపోతాయి. దుర్గాదేవి పాదాలను అత్యంత భక్తి శ్రద్ధలతో ఎవరైతే ఆశ్రయిస్తారో, అలాంటి వారిని ఆ తల్లి ఒక రక్షణ కవచంగా కాపాడుతూ ఉంటుందని ఆధ్యాత్మిక గ్రంధాలు చెబుతున్నాయి.

More Bhakti Articles