కోరిన వరాలనిచ్చే శంకరుడు

సదాశివుడు భక్తుల పాలిట కామధేనువు. ఆ స్వామి దర్శనం చేసుకుంటే చాలు పాపాలన్నీ పటాపంచలవుతాయి. ఆయనని సేవిస్తే చాలు పుణ్యరాశి పెరుగుతూ పోతుంది. అంకితభావంతో అర్చిస్తే ఆ స్వామి మురిసిపోతాడు .. అత్యంత భక్తి శ్రద్ధలతో అభిషేకం చేస్తే పరవశించిపోతాడు. అనునిత్యం చేసే ఆరాధన మహాశివుడి మనసు గెలుచుకునేలా చేస్తుంది.

కోరిన వెంటనే వరాలనిచ్చే కొంగుబంగారం ఆ దేవదేవుడు. స్వామి మనసును గెలుచుకునే మార్గాలలో ఒకటి .. ఆయనకి ఇష్టమైన పూలను సమర్పించడం. తమ మనసులోని ధర్మబద్ధమైన కోరికలు నెరవేరాలనుకునే వాళ్లు ఈ పూలను సమర్పించవలసి ఉంటుంది. సంపెంగలు .. గులాబీలు .. పున్నాగలు .. నాగకేసరాలు .. కేసరీ పుష్పాలు .. గరిక పూలు .. స్వామికి అత్యంత ప్రీతికరమైనవని ఆధ్యాత్మిక గ్రంధాలు చెబుతున్నాయి. వీటిని సమర్పించడం వలన స్వామి ప్రీతి చెంది అనుగ్రహిస్తాడని స్పష్టం చేస్తున్నాయి.       


More Bhakti News