పుష్యమాసంలో లక్ష్మీదేవి ఆరాధన
జీవితంలో ప్రతి ఒక్కరికీ ధనం అవసరమే. ధనం వలన అన్నీ కాకపోయినా చాలా అవసరాలు తీరుతాయి. అవసరాల్లో .. ఆపదల్లో ధనం ఎంతగానో ఉపయోగపడుతుంది. మనసులోని ధర్మబద్ధమైన కోరికలను నెరవేర్చుకోవాలన్నా ధనం కావలసిందే. అందుకే ధనానికి అంతా ఎక్కువ ప్రాధాన్యతను ఇస్తుంటారు. ధనలక్ష్మీ తమని ఎప్పుడూ కాపాడుతూ ఉండాలని కోరుకుంటూ వుంటారు.
ధనలక్ష్మిని విశేషమైన రోజుల్లో పూజించడం వలన విశేషమైన ఫలితాలు కలుగుతాయని ఆధ్యాత్మిక గ్రంధాలు చెబుతున్నాయి. పుష్య మాసం లోను లక్ష్మీదేవిని పూజించడం వలన ఆశించిన ఫలాలు అందుతాయని స్పష్టం చేస్తున్నాయి. పుష్య మాసాన్ని 'పౌష్య లక్ష్మి'గా పిలుస్తుంటారు. పుష్య మాసంలో వ్యవసాయ పనులు పూర్తయి పంటలు ఇంటికి వస్తాయి. అంటే ధాన్యానికి ప్రతీక అయిన ధనలక్ష్మి ఇంటికి వచ్చినట్టే. ధనలక్ష్మిని పూజించడం వల్లనే .. ఆమె అనుగ్రహం వల్లనే ధనం ఇంటికి చేరుతుంది. ఆ లక్ష్మీదేవి కరుణ వల్లనే ధనం నిలుస్తుంది కనుక, ఈ మాసంలో ఆ తల్లిని తప్పక పూజించాలని స్పష్టం చేయబడుతోంది.