సకల శుభాలను ప్రసాదించే శ్రీమహావిష్ణువు

సకల శుభాలను ప్రసాదించే శ్రీమహావిష్ణువు
శ్రీమహావిష్ణువు లోక కల్యాణ కారకుడు. లోకాలను .. సమస్త జీవులను కాపాడటానికి ఆయన అనేక అవతారాలను ధరించాడు. దుష్ట శిక్షణ చేస్తూ .. శిష్ట రక్షణ చేస్తూ వచ్చాడు. అలాంటి శ్రీమహావిష్ణువు నామాన్ని ఎప్పుడు స్మరించినా పుణ్యమే. ఆ స్వామి దర్శన మాత్రం చేతనే సమస్త పాపాలు నశిస్తాయి. అనంతమైన పుణ్య ఫలాలు చేకూరతాయి.

అయితే విశేషమైన రోజులలో ఆ స్వామిని సేవించడం వలన, ఫలితం కూడా విశేషంగానే ఉంటుంది. అలాంటి విశేషమైన పర్వదినాలలో ఒకటిగా 'మార్గశిర బహుళ ఏకాదశి' కనిపిస్తుంది. ఈ రోజున ఏకాదశి వ్రతాన్ని ఆచరించవలసి ఉంటుంది. శ్రీమహావిష్ణువును షోడష ఉపచారాలతో పూజించి, ఈ వ్రతాన్ని ఆచరించడం వలన సకల శుభాలు చేకూరుతాయని ఆధ్యాత్మిక గ్రంధాలు చెబుతున్నాయి. అందువలన ఈ రోజున శ్రీ మహావిష్ణువును పూజించడం మరువకూడదు.

More Bhakti Articles