ఉపవాసం

ఉపవాసం
నిత్య జీవితంలో ఆధ్యాత్మిక పరిమళాన్ని ఆస్వాదించడానికి అందరూ ఆరాటపడుతుంటారు. ఈ నేపథ్యంలోనే అంతా పూజలు ... నోములు ... వ్రతాలు ... చేస్తుంటారు. ఇక ఈ సమయంలో సహజంగానే ఉపవాసాలు ఉంటూ వుంటారు. అయితే ఇలా ఉపవాసాలు చేసినప్పుడు తలకి నూనె రాసుకోకూడదనే నియమం చేయబడింది.

శనికి నూనె అంటే ఇష్టం ... అసలు నూనె అనే పదార్ధం ఉత్పత్తి కావడానికి కారకుడే ఆయన అని తెలుస్తోంది. అలాంటి నూనెను తలకి రాసుకున్నప్పుడు తలచుట్టూ మన కంటికి కనిపించని ఒక వలయం ఏర్పడుతుంది. ఈ వలయం ... ఇతర గ్రహాల నుంచి మన శరీరంలోకి ప్రవేశించ వలసిన అయస్కాంత తరంగాలను అడ్డుకుంటుంది.

ఇక ఉపవాస సమయంలో మన శరీరానికి ఇతర గ్రహాల నుంచి వచ్చే అయస్కాంత తరంగాల అవసరం వుంటుంది. శక్తిని ఇచ్చే ఈ తరంగాలను అడ్డుకోవడం అనారోగ్యాలకి గురిచేస్తుంది. అందువలన ఉపవాసపు రోజుల్లో తలకి నూనె రాసుకోకూడదనే నియమాన్ని పెద్దలు విధించినట్టు స్పష్ట మవుతోంది.

More Bhakti Articles