ఆపదలను తొలగించే సాయినాథుడు
శిరిడీలో తిరుగాడిన సాయిబాబాకి ఎంతోమంది భక్తులు వున్నారు. గ్రామాల్లోను .. కాలనీల్లోను ఆయన మందిరాలు ఆధ్యాతిక కేంద్రాలుగా భక్తిభావ పరిమళాలను వెదజల్లుతున్నాయి. అలాంటి బాబా మందిరాలలో ఒకటి పశ్చిమ గోదావరి జిల్లా జంగారెడ్డిగూడెం మండలం .. కన్నాపురంలో కనిపిస్తుంది.
ప్రశాంతమైన వాతావరణంలో నిర్మించబడిన ఈ ఆలయానికి భక్తులు పెద్దసంఖ్యలో వస్తుంటారు. ఆలయ ప్రాంగణంలో కూర్చుని భజనలు .. పారాయణాలు చేస్తుంటారు. ఇక్కడ బాబాను దర్శించుకోవడం వలన ఆపదలు తొలగిపోతాయని భక్తులు అనుభవపూర్వకంగా చెబుతుంటారు. ఆర్థికపరమైన ఇబ్బందులతోను .. అనారోగ్య సమస్యలతోను సతమతమైపోతున్నవాళ్లు, బాబాకి చెప్పుకోవడం వలన ఆశించిన ఫలితాలు కనిపించాయని చెబుతుంటారు. అందువల్లనే గ్రామస్తులంతా బాబా హారతుల్లో .. భజనలో ఉత్సాహంగా పాల్గొంటూ వుంటారు. ఆ స్వామి సేవలో తరిస్తూ వుంటారు.