శుభ సూచనలు

సాధారణంగా ఏ శుభకార్యాన్ని ప్రారంభించినా అది పూర్తి అవుతుందా ... లేదా? అనే విషయాన్ని మనకి ఎదురయ్యే కొన్ని శకునాలు చెప్పేస్తుంటాయి. అలాగే మరి కాసేపట్లో మనకి మంచి జరుగుతుందా ... చెడు జరుగుతుందా? అనే విషయాలు కూడా అవయవాల అదురుపాటు వలన తెలుస్తుందనే విశ్వాసం ప్రాచీనకాలం నుంచి వుంది.

పురుషులకి కుడిభాగాన ... స్త్రీలకి ఎడమభాగాన ఆయా అవయవాలు అదరడాన్ని బట్టి, వారు తలపెట్టిన కార్యాల వలన మేలు జరుగుతుందా ... కీడు జరుగుతుందా? అనేది తెలిసి పోతుంటుంది. పురుషులకి తలపై కుడిభాగాన అదిరితే 'స్థిరాస్తులు'దక్కుతాయి. నుదురు భాగం అదిరితే 'ఉన్నతమైన స్థానం' లభిస్తుంది. కంటి కొస అదిరితే 'సంపదలు' కలుగుతాయి. చెవి అదిరితే 'శుభకార్యాలు' జరుగుతాయి.

ఇక వెన్నెముక అదరడం వలన శుభాలు ... పొట్ట అదిరితే 'సుఖ సంతోషాలు' లభిస్తాయి. ముక్కు అదరడం వలన 'కీర్తి' ... చేయి అదరడం వలన 'ఆకస్మిక ధనలాభం' జరుగుతుందని తెలుస్తోంది. ఇక స్త్రీలకు ఎడమ భాగాన అదరడం వలన ఇవే ఫలితాలు దక్కుతాయని భావించ వచ్చు.

స్త్రీలకు ఎడమ కన్ను అదరడం మంచిదని చెబుతారు. సీత అశోక వనంలో వున్నప్పుడు, హనుమంతుడు సముద్రాన్ని దాటి తన జాడ తెలుసు కోవడానికి మరి కాసేపట్లో వస్తాడనగా ఆమె ఎడమ కన్ను అదిరిందట. ఆ క్షణం నుంచి ఆమెకి అంతా మంచే జరిగింది. కాబట్టి స్త్రీకి ఎడమ వైపున అదరడం మంచి ఫలితాలను సూచిస్తుందని తెలుస్తోంది.

More Bhakti Articles