కార్తీకంలో ఉసిరిక చెట్టు పూజా ఫలితం

కార్తీకం ఎన్నో పుణ్యఫలాలను అందించే మాసం. అందునా పౌర్ణమి మరింత విశేషాన్ని సంతరించుకుని కనిపిస్తుంది. కార్తీక పౌర్ణమి రోజున చేసిన జప తప పూజాదికాలు అక్షయ ఫలితాలను అందిస్తాయని ఆధ్యాత్మిక గ్రంధాలు చెబుతున్నాయి. ఈ రోజున ఆలయాలలో లక్ష తులసి పూజ .. లక్ష బిల్వార్చన .. లక్ష కుంకుమార్చన జరుపుతుంటారు. ఈ విధంగా చేయడం వలన సంపదలు .. సౌభాగ్యం .. మోక్షం లభిస్తాయని చెప్పబడుతోంది.

ఇక ఈ రోజున చేసే ఉసిరిక చెట్టు పూజ కూడా విశేషమైన ఫలితాలను ఇస్తుంది. ఈ రోజున ఉసిరిక చెట్టుకుని విష్ణు స్వరూపంగా భావించి పూజించాలి. భక్తి శ్రద్ధలతో ఉసిరిక చెట్టును పూజించడం వలన, సమస్త పాపాలు .. దోషాలు నశించిపోతాయి. ఆయురారోగ్యాలతో పాటు కీర్తి ప్రతిష్ఠలు కలుగుతాయి. ఇక ఈ రోజున ఆవు నేతితో వెలిగించిన దీప దానం చేయడం వలన కూడా సమస్త దోషాలు తొలగిపోతాయి.


More Bhakti News