ఆపదలో ఆదుకునే శివయ్య

ఎంతోమంది మహర్షులు శివలింగ ప్రతిష్ఠలు చేస్తూ .. ఆ స్వామిని ఆరాధిస్తూ వచ్చారు. అనునిత్యం ఆ స్వామిని సేవిస్తూ తరించారు. అలా మహర్షులు చేత శివయ్య పూజాభిషేకాలు అందుకున్న క్షేత్రాలలో ఒకటిగా 'తీర్థాల' కనిపిస్తుంది. ఖమ్మం జిల్లా పరిధిలో గల ఈ క్షేత్రం మహిమాన్వితమైనదిగా వెలుగొందుతోంది.

పూర్వం కొంతమంది మహర్షులు ఇక్కడ స్వామివారిని ప్రతిష్ఠించారని స్థల పురాణం చెబుతోంది. ఆ తరువాత కాలంలో ఒక భక్తుడి కారణంగా స్వామివారు వెలుగు చూశాడని అంటారు. శ్యామలాంబ .. భ్రమరాంబ సమేతంగా స్వామి దర్శనమిస్తుండటం ఇక్కడి విశేషం. ఆదిదేవుడిని దర్శించుకోవడం వలన సమస్త పాపాలు నశించి సకల శుభాలు కలుగుతాయని చెబుతుంటారు. ఆ స్వామిని పూజించడం వలన ఆపదలు తొలగిపోతాయని అంటారు. ఇదే ప్రాంగణంలో వేంకటేశ్వరస్వామి ఆలయం .. నరసింహస్వామి ఆలయం దర్శనమిస్తుంటాయి. ఇలా ఈ క్షేత్రం శివకేశవ క్షేత్రంగా ప్రసిద్ధి చెందింది.


More Bhakti News