ఆపదలను తొలగించే ఆంజనేయుడు
హనుమంతుడిని పూజించడం వలన ఆయురారోగ్యాలు చేకూరుతాయని ఆధ్యాత్మిక గ్రంధాలు చెబుతున్నాయి. ఆయనని సేవించడం వలన దుష్ట శక్తుల నుంచి రక్షణ లభిస్తుందని అంటున్నాయి. అందువలన హనుమంతుడిని ఆరాధించే భక్తుల సంఖ్య ఎక్కువగా ఉంటుంది. ఈ కారణంగానే ఆయన ఆలయాలు ఎప్పుడు చూసినా భక్తులతో సందడిగా కనిపిస్తుంటాయి. అలాంటి ఆలయాలలో ఒకటి మచిలీపట్నం - మాచవరంలో దర్శనమిస్తుంది.
ఇక్కడ హనుమంతుడు అభయాంజనేయుడుగా భక్తులకు దర్శనమిస్తుంటాడు. కొంతమంది భక్తులు స్వామివారిని ఇక్కడ ప్రతిష్ఠించుకుని పూజించుకుంటున్నారు. ఈ స్వామి మహిమాన్వితుడని చెబుతుంటారు. ఇక్కడి స్వామివారిని నమ్మినవారికి ఆపదలు దరిచేరవనీ, ఆయన అనుగ్రహం కారణంగా ఆపదల నుంచి బయటపడిన వాళ్లు ఎంతోమంది వున్నారని అంటారు. మంగళ .. శని .. ఆదివారాల్లోను .. విశేషమైన పర్వదినాల్లోను స్వామివారిని దర్శించే భక్తుల సంఖ్య ఎక్కువగా ఉంటుంది.